మాటల మాంత్రికుడి పొగడ్తలకు ఉబ్బితబ్బిబయిపోతున్న నితిన్

Nithin-and-Trivikram
‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమా విడుదలైన నాటి నుండీ నితిన్ కు ఫిలింనగర్ నుండి మంచి ప్రశంసలే అందుతున్నాయి. చాలామంది దర్శకులు, నటులు, నిర్మాతలు అతనికి కాల్ చేసి మరీ సినిమా తమకెంత నచ్చిందో చెప్తున్నారు. అయితే నితిన్ నటనకుగానూత్రివిక్రమ్ ఇచ్చిన కాంప్లిమెంట్ అతనికి చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో “‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమా చూశాక త్రివిక్రమ్ శ్రీనివాస్ నుండి ఫోన్ వచ్చింది, ఆయనకు సినిమా బాగా నచ్చేసింది.నీకు ఏవిధమైన సినిమాలు నప్పుతాయో ఆఖరికి తెలుసుకున్నావన్నారు. ‘ఇష్క్’ సినిమా హిట్ మొత్తం నిత్యా మీనన్ కు క్రెడిట్ చేస్తే … ‘గుండెజారి గల్లంతయ్యిందే’ మొత్తాన్ని నీ భుజాలపై వేస్కున్నావన్నారు. ఆయనిచ్చిన సలహాను ఎప్పటికీ మర్చిపోలేను, నా వయసుకు సరిపడే పాత్రలే చెయ్యడానికి ప్రయత్నిస్తానని”తెలిపాడు. అతని తరువాత సినిమా ప్రేమసాయి దర్శకత్వంలో ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’గా తెరకెక్కుతుంది. యామి గౌతం హీరొయిన్,

Exit mobile version