నేటి నుంచి ‘ జులాయి’ చిత్రీకరణలో ‘ ఇలియానా ‘


గోవా బ్యూటీ ‘ ఇలియానా ‘ మళ్లీ ” జులాయి ” టీం తో కలసి చిత్రీకరణలో పాల్గొననుంది, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో హీరోగా నటిసున్నారు .రవితేజ హీరోగా నటిస్తున్న ” దేవుడు చేసిన మనుషులు ” పాటల చిత్రీకరణ కోసం ఇటలీ వెళ్ళిన ఇలియానా , ఆ చిత్రం చిత్రీకరణ పూర్తవడంతో ఇటలీ నుంచి తిరిగివచ్చారు. ఈ రోజు నుంచి జులాయి చిత్రీకరణలో పాల్గొనబోతున్నారు. ‘ దేవుడు చేసిన మనుషులు ‘ జూన్ చివరి వారంలో విడుదల చేయడానికి సన్నాహలు చేస్తున్నారు అలాగే ‘ జులాయి ‘ ని జూలైలో విడుదల చేయాలని అనుకుంటున్నారు.

Exit mobile version