అక్షయ్ కుమార్ నటిస్తున్న గబ్బర్ లో ఇలియానా లేదట

First Posted at 03.50 on Apr 20th

Akshay_Kumar-ileana

ప్రస్తుతం వినిపిస్తున్న పుకార్ల ప్రకారం ఇలియానా హిందీ నటుడు అక్షయ్ కుమార్ నటిస్తున్న ‘గబ్బర్’ సినిమాలో హీరొయిన్ క్యారెక్టర్ చేస్తుందన్నారు. కానీ నిర్మాత సంజయ్ లీలా బన్సాలి ఈ సినిమా తారల వివరాలు ఇంకా ఖరారు కాలేదని వెల్లడించారు. ఈ సినిమాని క్రిష్ దర్శకత్వం వహిస్తాడని అన్నారు, ఆ మరుసటి రోజే అందులో ఇలియానా హీరొయిన్ అని పలు పుకార్లు వచ్చాయి. ఇప్పటివరకూ ఇలియానా కేవలం ‘బర్ఫీ’ అనే హిందీ సినిమాలో నటించింది. ఆమె నటిస్తున్న మరో సినిమా ‘ఫటా పోస్టర్ నికలా హీరో’ ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. సంజయ్ లీలా బన్సాలి ఈ విషయం గురించి మాట్లాడుతూ “మేము ఈ స్క్రిప్ట్ కు సంబంధించి హీరొయిన్ క్యారెక్టర్లో మార్పులు చేస్తున్నాం. అందుకని అవి పూర్తయ్యేవరకూ ఎవర్నీ ఖరారు చెయ్యలేం. ఈ కధకు కొత్త అందాన్ని తీసుకురాగలవారికోసం చూస్తున్నామని” తెలిపారు. ‘గబ్బర్’ చిత్రం తెలుగులో చిరంజీవి నటించిన ‘టాగూర్’ కి రీమేక్. తెలుగులో కుడా ఈ సినిమా మురుగుదాస్ తీసిన ‘రమణ’ సినిమాకి రీమేక్. ఇదిలా వుండగా ఆఖరిసారిగా ‘జులాయి’ సినిమాలో తెలుగుతెరపై కనిపించిన ఈ భామ, తన ‘బర్ఫీ’ విడుదల తరువాత ఇంకా ఏ ఒక్క తెలుగు, తమిళ సినిమాను అంగీకరించలేదు.

Exit mobile version