ప్రేమ లో పడ్డ ఇలియానా

ప్రేమ లో పడ్డ ఇలియానా

Published on Jan 2, 2012 4:30 PM IST


గోవా ముద్దుగుమ్మ ఇలియానా ప్రేమలో పడ్డాను అని చెప్పారు. ప్రేమలో పడింది అంటే ఏమో అనుకునేరు తను ప్రేమించేది ప్రకృతి మరియు పెంపుడు జంతువులను. ఇలియానా మాట్లాడుతూ “చాలా మంది పచ్చదనానికి మరియు ప్రకృతి అందాలకు ప్రాధాన్యత ఇవ్వరు. ఒక్క క్షణం ఆగి వెనక్కి చూసుకుంటే ప్రకృతి యొక్క అందం తెలుస్తుంది. నేను ప్రకృతి కోసం కాస్త సమయాన్ని కేటాయిస్తాను. ప్రకృతి తో ప్రేమలో పడిపోయాను” అని చెప్పారు.

ఇలియానా పెంపుడు జంతువులను కూడా ప్రేమిస్తుంది. ఇలియానా కొన్ని పిల్లులను మరియు కుక్కలను పెంచుకుంటుంది. ఖాళి సమయాల్లో వాటితోనే గడుపుతుంటుంది. ఇలియానా ప్రస్తుతం త్రివిక్రమ్ చేస్తున్న అల్లు అర్జున్ చిత్రం లో ను రవితేజ సరసన పూరి దర్శకత్వం లో వస్తున్న “ఇడియట్ 2 ” చిత్రం లో ను నటిస్తున్నారు. “స్నేహితుడు” విడుదలకు సిద్దంగా ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు