ఇలియానా నటనకి బాలీవుడ్లో సూపర్బ్ రెస్పాన్స్


తన నడుము ఒంపు సొంపులతో తెలుగు ప్రేక్షకులకు మత్తెక్కించిన గోవా బ్యూటీ ఇలియానా రన్బీర్ కపూర్ హీరోగా నటించిన ‘బర్ఫీ’ చిత్రం ద్వారా బాలీవుడ్ కి పరిచయమయ్యారు. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా మంచి హిట్ టాక్ తో ప్రదర్శించబడుతోంది. ఈ చిత్రంలో ఇలియానా నటనని అటు విమర్శకులు, ఇటు ప్రేక్షకులు ఎక్కువగా పొగుడుతున్నారు. ఈ చిత్రంలో ఇలియానా పూర్తిగా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రను పోషించారు. టాలీవుడ్లో ఎక్కువ గ్లామర్ ప్రాధాన్యం ఉన్న పాత్రలు పోషించిన ఇలియానా హిందీలో నటించిన మొదటి చిత్రంతోనే తన నటనకి మంచి పేరు తెచ్చుకున్నారు. అప్పుడే ముంబై మీడియా ఇలియానా బాలీవుడ్లో చాలా పెద్ద స్థాయికి వెళుతుందని జాతకం చెప్పేస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో ఇలియానాకి పోటీగా టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒకరైన మిల్క్ బ్యూటీ తమన్నా కూడా అజయ్ దేవగన్ హీరోగా నటించనున్న ‘హిమ్మత్ వాలా’ రిమేక్ చిత్రంతో బాలీవుడ్ కి పరిచయం కానున్నారు. ఇటీవలే ‘జులాయి’ సినిమాతో తెలుగులో హిట్ కొట్టిన ఇలియానా వెంటనే ‘బర్ఫీ’ సినిమాతో హిందీలో కూడా హిట్ కొట్టి ఆ ఫలితాన్ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది.

Exit mobile version