ఆ నమ్మకం తొలి సినిమాతోనే వచ్చింది – ఇలియానా

illeyana

ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలుగొందిన గోవా బ్యూటీ ఇలియానా ప్రస్తుతం బాలీవుడ్ లో పాగా వేసింది. ‘బర్ఫీ’ సినిమాతో బాలీవుడ్ కి పరిచయమైన ఈ భామ ఆ తర్వాత సౌత్ లో ఒక్క సినిమా కూడా చెయ్యలేదు. ఇటీవలే విడుదలైన ‘ఫటా పోస్టర్ నిక్లా హీరో’ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఇలియానా మాత్రం ధైర్యంగా మాత్రం బాలీవుడ్ లోనే ఎక్కువ అవకాశాలు దక్కించుకోవడానికి ప్రయత్నిస్తోంది.

ఇదే విషయాన్ని ఈ గోవా బ్యూటీని అడిగితే ‘ సౌత్ లో కూడా అంత తేలిగ్గా నాకు విజయాలు రాలేదు. ఒక్కో అడుగు వేస్తూ ముందుకు వెళ్ళడమే నాకిష్టం. రాత్రికి రాత్రే స్టార్ అవ్వాలని లేదు. అలాగే ఇక్కడి వాతావరణం నచ్చింది. నా మొదటి సినిమాతో ఇక్కడే సెటిల్ అయిపోగలనన్న నమ్మకం వచ్చింది. భవిష్యత్తు ఆశావాహకంగా కనిపిస్తోందని’ చెప్పింది.

ప్రస్తుతం ఇలియానా సైఫ్ అలీ ఖాన్ సరసన ‘హ్యాపీ ఎండింగ్’ అనే సినిమా చేస్తోంది. ఈ సినిమాతో తన కల నెరవేరాలని ఆశిద్దాం.

Exit mobile version