గోవా బ్యూటీ ఇలియానాకి 2013 బాలీవుడ్లో ప్రత్యేక సంవత్సరం కానుంది అనడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. టాలీవుడ్లో మంచి పేరున్న ఇలియానా 2012లో చేసిన ‘బర్ఫీ’ సినిమా ద్వారా బాలీవుడ్ కి పరిచయమైంది. ఆ సినిమాతో కమర్షియల్ హిట్ అందుకోవడమే కాకుండా, తన నటనకి విమర్శకుల ప్రశంశలు కూడా అందుకుంది. ప్రస్తుతం ముంబైలో అవార్డ్స్ వేడుకలు మొదలు కానున్నాయి.
అన్ని పెద్ద పెద్ద అవార్డు వేడుకల్లోనూ 2012 లో బాలీవుడ్ కి పరిచయమైన కొత్త హీరోయిన్ కోసం అందరూ ఇలియానాని రెకమండ్ చేస్తున్నారు. 2012 బాలీవుడ్ కి మరో ముగ్గురు కొత్త హీరోయిన్స్ పరిచయమయ్యారు కానీ అందరికంటే ఇలియానా పేరే ఎక్కువగా వినిపిస్తోంది. గత సంవత్సరం ఇలియానా టాలీవుడ్లో కూడా ‘జులాయి’ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది.