సమంతా సినిమాకోసం లండన్ వెళ్ళిన ఇళయరాజా


మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా ప్రస్తుతం లండన్లో స్వరాలు సమకూరుస్తున్నారు. ఏ సినిమాకి అనుకుంటున్నారా? సమంతా హీరొయిన్ గా గౌతం మీనన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ సినిమా కోసం. తెలుగు, తమిళ్, హిందీ మూడు భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాల్లో సమంతానే హీరొయిన్. తెలుగులో సమంతకి జోడీగా నాని నటిస్తుండగా తమిళ్లో జీవా నటిస్తున్నాడు. హిందీలో ఆదిత్య రాయ్ నటిస్తున్నాడు. ప్రస్తుతం ఇళయరాజా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా పై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. స్వతహాగా ఇళయరాజా అభిమాని అయిన గౌతం మీనన్ ఆయనతో కలిసి పని చేయడంతో ఆనందంగా ఉన్నారు. ఇద్దరు కలిసి పనిచేసేటప్పుడు తీసిన ఫోటోలు ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేసారు.

Exit mobile version