ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ సినిమాతో వెండితెర పై ఎంట్రీ ఇవ్వడమే కాకుండా, తొలి ప్రయత్నంలోనే మంచి హిట్ సొంతం చేసుకున్నాడు నవీన్ పోలిశెట్టి. ఆ సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో నవీన్ పోలిశెట్టి పేరు బయట మారుమోగిపోతుంది. అతడి కామెడీ టైమింగ్‌కి చాలామంది ఫిదా అయిపోయి ఫ్యాన్స్‌గా మారిపోయారు. ముఖ్యంగా యూత్‌లో నవీన్ క్రేజ్ అమాతం పెరిగిపోయింది. అదే క్రేజ్ అతను లేటెస్ట్‌గా జాతిరత్నాలు అనే కామెడీ ఎంటర్‌టైనర్ సినిమా చేశాడు. లాక్‌డౌన్ తర్వాత ఈ సినిమా థియేటర్స్‌కి రానుంది.
అయితే బాలయ్య బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రంలో నవీన్ ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నట్లు వార్తలు రావడం, వాటి పై నవీన్ స్పందిస్తూ.. బోయపాట శ్రీనివాస్ సినిమాలో నటించే చాన్స్ రావడం, తనకు మంచి అవకాశమే అయినా.. ఆ సినిమాకు సంబంధించి ఇంతవరకూ నన్ను ఎవరూ సంప్రదించలేదు. ఈ సినిమాలో నేను చేయనున్నట్టు వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని.. అదంతా కేవలం పుకారు మాత్రమే అని క్లారిటీ ఇచ్చేశాడు. ఇక జాతిరత్నాలు గాని హిట్ నవీన్ రేంజ్ మారిపోతుంది. హీరోగా అతనికి ఫుల్ డిమాండ్ పెరుగుతుంది.