వాటితో కమ్యూనికేట్ అవ్వకపోతే తప్పు చేసినట్టా?

వాటితో కమ్యూనికేట్ అవ్వకపోతే తప్పు చేసినట్టా?

Published on Dec 9, 2012 12:39 PM IST

గోవా బ్యూటీ ఇలియానా ‘దేవదాసు’ ఆ తర్వాత ‘పోకిరి’ సినిమాతో తెలుగు వారి అభిమానాన్ని అందుకుంది. ప్రముఖ పత్రికతో ఇలియానా మాట్లాడుతూ ‘ ఈ మధ్య మనతో పాటు టెక్నాలజీ కూడా ఎంతో డెవలప్ అవుతోంది. అందరూ సెల్ ఫోన్లూ, కంప్యూటర్లు, వివిధ రకాల గాడ్జెట్లు అంటూ వాటి మైకంలో పడిపోతున్నారు. చాలా మంది ఫేస్ బుక్, ట్విట్టర్ అని హడావుడి చేస్తారు. మనం వాటితో కమ్యూనికేట్ అవడంలేదని తెలిస్తే మనమేదో పెద్ద తప్పు చేసినట్టు చూస్తారు. అవి మనకు అవసరం మాత్రమే వాటికి ఎంత విలువ ఇవ్వాలో అంతే ఇవ్వాలి. సెల్ ఫోన్ అవసరం మాత్రమే నావరకైతే ఎప్పుడెప్పుడు సెల్ స్విచ్ ఆఫ్ చేద్దామా అని ఉంటుంది. అలా చేసినప్పుడే నా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందని’ అంది. ‘బర్ఫీ’ తో బాలీవుడ్లో హిట్ కొట్టిన ఇలియానా ప్రస్తుతం తెలుగులో ఆఫర్లు వస్తున్నా బాలీవుడ్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టేసింది. ప్రస్తుతం ఇలియానా షాహిద్ కపూర్ సరసన ఓ సినిమా చేస్తోంది.

తాజా వార్తలు