స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించనున్న ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా షూటింగ్ బ్యాంకాక్‌లో ప్రారంభమైంది. ఈ స్టైలిష్ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో అందాల భామలు అమలా పాల్, కేథరిన్ థెరిసా అల్లు అర్జున్ సరసన ఆడి పాడనున్నారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ చిత్రాల నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. ఈ రోజు ఉదయం ఈ చిత్ర ప్రధాన నటీనటులు బ్యాంకాక్ కి పయనమయ్యారు. ఈ సినిమాని ఎక్కువభాగం బ్యాంకాక్, న్యూజీ ల్యాండ్ లలో చిత్రీకరించనున్నారు.
ఈ సినిమాలో సూపర్ స్టైలిష్ గా అల్లు అర్జున్ కనిపించానున్నాడని ఇది వరకే తెలిపాము. లుక్ మరియు కాస్ట్యూమ్స్ విషయంలో పూరి, బన్ని చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి అమోల్ రాథోడ్ సినిమాటోగ్రాఫర్. 2013 సమ్మర్ చివర్లో ఈ సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.