గ్రాండ్ గా విడుదలైన ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా ఆడియో

Iddarammayilatho-Audio-Rele

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సినిమా ‘ఇద్దరమ్మాయిలతో’. ఈ సినిమా ఆడియో లంచ్ ఈ రోజు శిల్ప కల వేదికలో గ్రాండ్ గా జరిగింది.ఈ వేడుకకి రామ్ చరణ్ ముఖ్య అతిదిగా విచ్చేశాడు. అల్ల్లుఅర్జున్, స్నేహ, అమల పాల్, కేథరిన్, చార్మీ, వివి వినాయక్, పూరి జగన్నాథ్, బండ్ల గణేష్, దేవీ శ్రీ ప్రసాద్ లు మొదలగు సిని ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన ఈ సినిమా సాంగ్స్ కి, ప్రోమోస్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

ఈ వేడుకలో ముఖ్యంగా చెప్పుకోవలసిన విషయం అల్లు అర్జున్ స్పీచ్ ‘ఈ సినిమాకి 200మంది వరకు పని చేశారు. కానీ ఒక్క హీరోకి మాత్రమే క్రెడిట్ వస్తుంది. కాని ఆ క్రెడిట్ ఆ సినిమాకి పనిచేసిన అందరిది’ అని అన్నాడు. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ ‘పవన్ కళ్యాణ్ అందరి మనసులు గెలుచుకొని పవర్ స్టార్ అయ్యాడు. అలాగే రామ్ చరణ్ కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరో కావాలని ఆశిస్తున్నాను’ అని అన్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న’ఇద్దరమ్మాయిలతో’సినిమాలో అమల పాల్, కేథరిన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దేవీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాని మే 24న విడుదలచేయలనుకుంటున్నారు.

Exit mobile version