స్పెయిన్ లో మొదలైన ఇద్దరమ్మాయిలతో సందడి

Iddarammayilatho Movie Opening
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా షూటింగ్ ఈ రోజు నుంచి స్పెయిన్ లో ప్రారంభమైంది. కొన్ని రోజుల క్రితమే పూరి జగన్నాధ్ – అల్లు అర్జున్ స్పెయిన్ చేరుకున్నారు, మిగిలిన చిత్ర టీం నిన్న స్పెయిన్ చేరుకుంది. అమలా పాల్ – కేథరిన్ థెరిసా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అల్లు అర్జున్ సరికొత్త స్టైలిష్ అవతారంలో కనిపించనున్న ఈ సినిమా కోసం పూరి జగన్ కూడా తన టీంలో మార్పులు చేసారు.

అందులో భాగంగానే అమోల్ రాథోడ్ సినిమాటోగ్రాఫర్ గా తీసుకొని సినిమా మొత్తాన్ని డిజిటల్ ఫార్మాట్ లో తీస్తున్నాడు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ సినిమాని సమ్మర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version