‘ఇద్దరమ్మాయిలతో’కి మొదలైన డబ్బింగ్

‘ఇద్దరమ్మాయిలతో’కి మొదలైన డబ్బింగ్

Published on Apr 2, 2013 1:45 AM IST

Iddarammailatho11
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా డబ్బింగ్ ప్రసాద్ లాబ్స్ లో ప్రారంభమైంది. ప్రస్తుతం ప్రసాద్ ల్యాబ్స్ లో ఈ సినిమాలో నటించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల డబ్బింగ్ జరుగుతోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కేథరిన్, అమలా పాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్పెయిన్ లో జరుగుతోంది. బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాకి అమోల్ రాథోడ్ సినిమాటోగ్రాఫర్ గా, ఎస్.ఆర్.శేఖర్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. అల్లు అర్జున్ గత చిత్రం ‘జులాయి’ మంచి విజయాన్ని సాదించింది. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా కూడా పెద్ద హిట్ సాదిస్తుందని భావిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ సమ్మర్లో విడుదల కానుంది.

తాజా వార్తలు