స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా గత శుక్రవారం విడుదలై మిశ్రమ స్పందనని నమోదు చేసుకుంది. కానీ ఈ సినిమా కలెక్షన్స్ మాత్రం బాగున్నాయి. వారం చివరి వరకు మంచి ఒపినింగ్ తో సాగిన ఈ సినిమా కలెక్షన్స్ సోమవారం, మంగళ వారం కూడా అలాగే కొనసాగుతున్నాయి. ఈ శుక్రవారం ఏ పెద్ద సినిమా విడుదల కాకపోవడం కూడా ఈ సినిమా ప్లస్ అయ్యింది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మించాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఫైట్స్ ని కంపోస్ చేసింది కెచా. ఈ సినిమాలో అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంది. కేథరిన్ గ్లామరస్ కూడా ఈ సినిమాకి మంచి అట్రాక్షన్. అమోల్ రాథోడ్ సినిమాటోగ్రాఫర్ గా, శేఖర్ ఎడిటర్ గా పనిచేసిన ఈ సినిమాలో అమలా పాల్ మరొక హీరోయిన్ గా నటించింది.