ఈ నెల 24న ‘ఇద్దరమ్మాయిలతో’ సెన్సార్

Iddarammayilatho

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా ఈ నెల 24 న సెన్సార్ కార్యక్రమాలను జరుపుకోనుంది. ఈ విషయాన్ని నిర్మాత బండ్ల గణేష్ తెలియజేశారు. ‘ఈ సినిమా 24న సెన్సార్ కార్యక్రమాలను ముగించుకొని ఈ నెల 31న విడుదలచేస్తాము’ అని గణేష్ తెలియజేశారు. ఈ సినిమాలో కేథరిన్, అమలా పాల్ హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించగా అమోల్ రాథోడ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. పూరి జగన్నాథ్ దర్శకతం వహించిన ఈ స్టైలిష్ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాలో యాక్షన్ ఎక్కువ ఉంటాయి.

Exit mobile version