స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘ఇద్ధరమ్మాయిలతొ..’ సినిమా మొదటివారం కలెక్షన్లు అల్లు అర్జున్ కెరీర్ లోనే టాప్ షేర్స్ ను సొంతం చేసుకుంది. ఇప్పటివరకూ అతని కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అయిన ‘జులాయి’ సినిమా ఫస్ట్ వీక్ రికార్డ్స్ ను ఈ సినిమా బీట్ చేసింది. నైజం ఏరియాలో దాదాపు 7కోట్లను వసూలు చేస్తూ మొత్తం అన్ని ఏరియాలలో సుమారు 20కోట్ల కలెక్షన్ల మార్కును సొంతం చేసుకుంది. ఈ సినిమాలో అమలా పాల్, కేథరీన్ త్రేస హీరోయిన్స్. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు కేచ కంపోజ్ చేసిన ఫైట్స్, దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన బీట్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.