నేను టాలీవుడ్ ని ఎప్పటికి మరచిపోను – ఇలియానా

ileana

అందాల నటి ఇలియానా తెలుగు సినిమాలలో నటించి మంచి పేరును తెచ్చుకుంది . ఆమె నటించిన కొన్ని సినిమాలు భారీ విజయాన్ని సాదించాయి. అలాగే ఇప్పుడు బాలీవుడ్ లో కూడా నెమ్మదిగా తన స్థానాన్ని పదిలం చేసుకుంటోంది. ఆమె నటించిన బాలీవుడ్ మొదటి సినిమా ‘బర్ఫీ’ మంచి విజయన్ని సాదించింది. దానితో ఆమెకు బాలీవుడ్ లో మంచి ఆఫర్స్ వస్తున్నాయి. తను నటించిన రెండవ హిందీ సినిమా ‘ఫటా పోస్టర్ నికల హీరో’ సినిమా కూడా విడుదలకు సిద్దమవుతోంది. తన లేటెస్ట్ సినిమా ప్రమోషన్స్ లో తెలుగు సినిమాలలో నటిస్తారా అన్నదానిపై మాట్లాడుతూ ‘ నేను తెలుగు సినిమా అబిమానులకు చాలా ఋణపడి ఉన్నాను. నాకు బాలీవుడ్ లో అవకాశం రావడానికి కారణం దక్షిణాన నేను నటించిన సినిమాలలోని నా నటన. నేను ఎప్పటికి టాలీవుడ్ ని మరచిపోలేను. త్వరలో నేను అక్కడ సినిమాలు చేస్తాను’ అని అంది. ఇలియానా నటించిన చివరి తెలుగు సినిమా ‘జులాయి’.

Exit mobile version