అలాంటి థ్రిల్లర్ చిత్రాలు చేయడం చాలా ఇష్టం : మనోజ్

అలాంటి థ్రిల్లర్ చిత్రాలు చేయడం చాలా ఇష్టం : మనోజ్

Published on Jul 26, 2012 10:34 AM IST


రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ‘బార్న్ ఐడెంటిటీ’ లాంటి థ్రిల్లర్ చిత్రాల్లో నటించడం చాలా ఇష్టమని అంటున్నారు. ఇటీవలే మేము చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మేము అడిగిన ఓ ప్రశ్నకు మంచు మనోజ్ ఇలా సమాధానం ఇచ్చారు ” ‘బార్న్ ఐడెంటిటీ’ చిత్ర కథ మరియు కాన్సెప్ట్ నన్ను చాలా బాగా ఆకర్షించింది. అలాంటి గూడాచారి నేపధ్యంలో సాగే ఒక థ్రిల్లర్ సినిమా చేయాలని అనుకుంటున్నాను, ఖచ్చితంగా చేస్తాను అని” ఆయన అన్నారు.

మంచు మనోజ్ హీరోగా నటించిన ‘ఊ కొడతారా ఉలిక్కి పడతారా’ చిత్రం రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. నటసింహం నందమూరి బాలకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి చిత్ర వర్గాల నుండి మంచి రిపోర్ట్ వస్తోంది. దీక్షా సేథ్ కథానాయికగా నటించన ఈ చిత్రాన్ని మంచు లక్ష్మీ ప్రసన్న నిర్మించారు. ఇప్పటి వరకూ డా. మోహన్ బాబు బ్యానర్ లో నిర్మించిన అత్యధిక భారీ బడ్జెట్ చిత్రం ఇదే.

తాజా వార్తలు