అందుకే సూపర్ మేన్ లాంటి పాత్రలు చేయను – కార్తి

అందుకే సూపర్ మేన్ లాంటి పాత్రలు చేయను – కార్తి

Published on Dec 17, 2013 8:00 AM IST

Karthi
స్వతహాగా తమిళ వాడే అయినప్పటికీ తెలుగు బాగా మాట్లాడగలడు, అలాగే తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోగల కార్తి హీరోగా తమిళంతో పాటు తెలుగులో కూడా అంతే క్రేజ్ తెచ్చుకున్నాడు. కార్తి హీరోగా రానున్న చిత్రం ‘బిరియాని’. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. హన్సిక హీరోయిన్ గా కనిపించనున్న ఈ సినిమాకి యువన్ శంకర్ రాజ సంగీతం అందించాడు. ఈ సందర్భంగా ఆయన కాసేపు మీడియాతో ముచ్చటించారు.

అందులో భాగంగా మీ అన్నయ్యలా సిక్స్ ప్యాక్ లుక్ లో ఎప్పుడు కనిపించనున్నారు? బిరియానిలో ఏమన్నా సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపిస్తారా అని అడిగితే కార్తి సమాధానమిస్తూ ‘ ఎక్కడికి వెళ్ళినా ఇదే ప్రశ్న అడుగుతున్నారు. ఈ సినిమాకి సిక్స్ ప్యాక్ అవసరం లేదు. నేను చేసే పాత్రలన్నీ సహజత్వానికి దగ్గరగా ఉంటాయి. అందువల్లే ఎప్పుడు సిక్స్ ప్యాక్ డిమాండ్ చెయ్యలేదు. పాత్రకి అవసరం ఉంటే చెయ్యాలి. ఉదాహరణకి బాక్సర్ గా కనిపించాలనుకోండి సిక్స్ ప్యాక్ చేయాలి. సూపర్ మేన్ పాత్ర చేయడానికి సిక్స్ ప్యాక్ కావాలి. అందుకే నేను ఇలాంటి పాత్రలు చెయ్యనని’ అన్నాడు.

తాజా వార్తలు