కెరీర్ మొదట్లో భారీ హిట్స్ ఆ తర్వాత ఫ్లాప్స్ మళ్ళీ బ్లాక్ బస్టర్ హిట్స్ మళ్ళీ ప్రస్తుతం వరుస ఫ్లాపుల్లో ఉన్న నిర్మాత, డైరెక్టర్ ఎంఎస్ రాజు. మొదటగా నిర్మాతగా ఇండస్ట్రీకి పరిచయమైన ఎంఎస్ రాజు ఆ తర్వాత రైటర్ గా, ఆ తర్వాత దర్శకుడి అవతారమెత్తాడు. కానీ నిర్మాతగా, రైటర్ గా విజయాలు అందుకున్న ఈయన డైరెక్టర్ గా మాత్రం ఒక్క విజయాన్ని కూడా అందుకోలేక ఫ్లాప్ డైరెక్టర్ గా ముద్ర వేసుకున్నాడు.
తాజాగా ఓ ప్రముఖ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మేకింగ్ లో కింగ్ అనిపించుకున్న మీరు డైరెక్టర్ గా ఎందుకు మారాలనిపించిందని అడిగితే ‘ నేను కెరీర్ మొదలు పెట్టినప్పుడు నా సినిమాకి నేనే కథలు రాస్తానని అనుకోలేదు. అలాగే నా సినిమాలో డైరెక్టర్ సాంగ్స్ తీస్తున్నప్పుడు నేను సీన్స్ డైరెక్ట్ చెయ్యలగలనని కూడా ఎప్పుడూ అనుకోలేదు. నేను డైరెక్టర్ గా మారడమే మిస్టేక్ అని మీరంటే.. అదే తప్పుని మళ్ళీ మళ్ళీ చేస్తాను. ఎందుకంటే ఎన్ని మిస్టేక్స్ చేస్తే అంత నేర్చుకోవచ్చు. త్వరలోనే మరో మిస్టేక్ చేయబోతున్నాను. దర్శకుడిగా నేనేంటో నిరూపించుకునే సినిమా అవుతుందని’ ఎంఎస్ రాజు అన్నాడు.