ఆ రెండు సినిమాలు రీమేక్ చేస్తానంటున్న రెబల్ స్టార్

ఆ రెండు సినిమాలు రీమేక్ చేస్తానంటున్న రెబల్ స్టార్

Published on Dec 24, 2012 11:50 AM IST

krishnam_Raju

ఆరు అడుగుల పొడవుండి ఆజానుబాహుడులా ఉండే రెబల్ స్టార్ కి ఆయన నటించిన రెండు సినిమాలను రీమేక్ చేయాలని ఉందట. కృష్ణం రాజు నిన్న శ్రీ కాళహస్తీస్వరుని దర్శనం చేసుకున్నారు, ఈ సందర్భంగా ఆయన తన గత స్మృతుల్ని గుర్తుకు తెచ్చుకున్నాడు. ఆయన మాట్లాడుతూ ‘ నేను ఇదే గుడిలో భక్త కన్నప్ప సినిమా తీశాను. అప్పటికీ ఇప్పటికీ గుడిలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఆ శివుడి అనుగ్రహం ఉంటే ప్రభాస్ ని హీరోగా పెట్టి ‘భక్త కన్నప్ప’ రీమేక్ చేస్తాను. అలాగే నా సొంత బ్యానర్లో వచ్చిన ‘మన ఊరి పాండవులు’ సినిమాని ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా మార్చి తీయాలని ప్లాన్ చేస్తున్నాను. ఈ రెండు సినిమాలు ఖచ్చితంగా రీమేక్ చేస్తానని’ అన్నాడు.

తాజా వార్తలు