భాయ్ సినిమాలో నేను మూడు విభిన్న పాత్రలలో కనిపిస్తాను : నాగార్జున

భాయ్ సినిమాలో నేను మూడు విభిన్న పాత్రలలో కనిపిస్తాను : నాగార్జున

Published on Aug 10, 2013 5:39 PM IST

nagarjuna-in-bhai

‘భాయ్’ కు సంబంధించిన కొన్ని ఆసక్తికర అంశాల గురించి తెలపడానికి కింగ్ నాగార్జున ఈరోజు మీడియాతో సమావేశమయ్యారు

ఈ సమావేశంలో టైటిల్ సాంగ్ ను కుడా క్లుప్తంగా ప్లే చేసారు

” నేను యాక్షన్ ఎంటర్టైనర్ లో నటించి చాలా రోజులయింది. మనం రోజూ ఎదుర్కుంటున్న ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఎంటర్టైన్మెంట్ చాలా సహకరిస్తుంది. ‘భాయ్’ హింసాత్మకమైన చిత్రం కాదు. కుటుంబసమేతంగా చూడదగ్గ సినిమా. ఈ సినిమాలో వుండే డైలాగులను ‘భాయ్ బుల్లెట్స్’ పేరిట సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ఒక కొత్త పేజీను ప్రారంభిస్తున్నాం. అంతే కాక అన్నపూర్ణ యుట్యూబ్ ఛానల్ ప్రారంభిస్తున్నాం. అన్నపూర్ణ స్టూడియోస్ పేరిట ఒక వెబ్ సైట్ ను కుడా ప్రారంభించనున్నా”మని నాగార్జున తెలిపారు

అంతేకాక ఆయన ఈ సినిమాలో తన పాత్ర గురించి చెప్పారు. “నేను ఈ సినిమాలో మూడు విభిన్న పాత్రలలో నటిస్తాను. అందులో హాంకాంగ్ డాన్ రైట్ హ్యాండ్ పాత్ర ఒకటి. రెండవ పాత్రలో హైదరాబాద్ లో ఒకదానికి కోసం వెతుక్కుంటూ వచ్చేది. మూడోది ఫ్యామిలీ ఎపిసోడ్ల కోసం తెరకెక్కించిన పాత్ర” అని తెలిపారు

ఈ వేడుకలో దర్శకుడు వీరభద్రమ్ చౌదరి మాట్లాడుతూ “నాకీ అవకాశం ఇచ్చిన నాగార్జునకు ధన్యవాదాలు. చాలా మంది సినీరంగంలోకి అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ ద్వారానే పరిచయమయ్యారు. నేను కుడా ఆ బ్యానర్ లో పనిచెయ్యడం అదృష్టంగా భావిస్తాను. అద్భుతమైన లోకేషన్లలో ఫుల్ మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా మనముందుకు రానుందని” తెలిపారు

తాజా వార్తలు