దక్షిణాదినే కాక బాలీవుడ్ లో సైతం తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న హీరోయిన్లలో కాజల్ అగర్వాల్. ప్రస్తుతం పలు తమిళ చిత్రాలతో బిజీగా వున్న ఈ భామ ఇంతవరకూ మరే తెలుగు సినిమానూ అంగీకరించలేదు
ఒక తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఎటువంటి సందేహాలూ లేకుండా నిక్కచ్చిగా సమాధానాలను ఇచ్చింది. అందులో ఒక ప్రశ్నకు ఆమె ఇచ్చిన జవాబు ఆశ్చర్యపరిచింది. అదేమిటంటే తాను సూపర్ స్టార్ రజినికాంత్ సరసన నటిస్తే ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోదట
అంతే కాక మీడియా అడిగిన ఒక ప్రశ్నకు ఇప్పటితరం హీరోయిన్లలో శ్రేయ ఇంకా అవకాశాల కోసం ఎదురుచూడనవసరం లేదని తెలిపింది. దీని వెనుక ఆమె మనసులో దాగున్న భావమేమిటో తనకే తెలియాలి