ప్రేమ కథా చిత్రమ్ కు నేనే దర్శకుణ్ణి: మారుతి

director-maruthi
ఈ ఏడాది విడుదలైన చిన్న బడ్జెట్ సినిమాలలో కొన్ని కేంద్రాలలో 100 రోజులు ఆడడమే కాక భారీ విజయాన్ని అందుకున్న సినిమాలలో ‘ప్రేమ కథా చిత్రమ్’ది అగ్రస్థానం. ఈ సినిమాలో ‘దర్శకత్వ పర్యవేక్షణ’ అనే పదం చాలా మందికి విడ్డూరంగా అనిపించింది.

సినిమా టైటిల్స్ లో దర్శకత్వ బాధ్యతలు జె.ప్రభాకర్ రెడ్డి చేపడితే పర్యవేక్షణ మారుతి అండలో జరిగింది. ఇప్పుడు ఆఖరికి మారుతి దీనివెనకున్న రహస్యాన్ని బయటపెట్టాడు. ఈ సినిమాను తానే దర్శకత్వం వహించినట్టు తెలిపాడు. అసలు కధ ఏమిటంటే మారుతి అల్లు అరవింద్ నిర్మాతగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ‘కొత్త జంట’ సినిమా తియ్యాలాట. అయితే కొన్ని కారణాల వలన ఈ సినిమా మొదలవడం ఆలస్యం అవుతుండడంతో ఈలోపు చిన్న బడ్జెట్ లో ఒక సినిమాను తీస్తానని మారుతి అరవింద్ కు చెప్పాడట. అయితే ఒకవేళ ఆ సినిమా ఫ్లాప్ అయితే తన సినిమా పై ప్రభావం చూపుతుందన్న భయంతో అల్లు అరవింద్ కోరిక మేరకు దర్శకత్వ పర్యవేక్షణ అని వేసుకున్నాడట. ఈ సినిమా మారుతి కెరీర్ లోనే పెద్ద హిట్ గా నిలిచింది. ఈ సినిమాను బాలీవుడ్ లోకి రీమేక్ చేసే ఆలోచనలు కుడా వున్నాయి

Exit mobile version