ప్రతి ఒక్క డైరెక్టర్ కి సూపర్ స్టార్ రజనీ కాంత్ గారితో సినిమా చేయాలనుకుంటారు. కానీ కొంత మంది దర్శకులకు మాత్రమే ఆ లక్కీ చాన్స్ దక్కింది. గత 15 సంవత్సరాల్లో రజనీ కాంత్ శంకర్, కె.ఎస్ రవి కుమార్, పి. వాసు లాంటి కొద్దిమంది దర్శకులతో మాత్రమె కలిసి పని చేసారు. ఇటీవలే రజనీ కాంత్ లైఫ్, కెరీర్ గురించి రాసిన బుక్ ని లాంచ్ చేసారు.
ఈ కార్యక్రమానికి హాజరైన శేఖర్ కమ్ముల మాట్లాడుతూ ‘ ఈ మధ్యకాలంలో రజనీ కాంత్ ఎవ్వరూ అందుకోలేనంత స్టార్డం ని అందుకున్నారు. ఆయనొక ఐకాన్. నేను ‘లీడర్’ సినిమా తీసిన తర్వాత చాలా రోజులు ఆయన్ని కలవడానికి ట్రై చేసాను, కానీ కుదరలేదు. నేను తమిళ్లో ఆయనతో ‘లీడర్’ సినిమాని రీమేక్ చేయాలనుకున్నాను. ఎందుకంటే ఆయనకే గవర్నమెంట్ మార్చగల పవర్ ఉందని’ అన్నారు.
ఆ తర్వాత రజనీ ఆరోగ్యం బాలేకపోవడం, ఇప్పుడు ఆయన ఎక్కువ కష్టపడలేరు కావున శేఖర్ కమ్ముల కల తీరుతుందో లేదో చూడాలి. ప్రస్తుతం శేఖర్ కమ్ముల తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న ‘కహాని’ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా ఉన్నాడు.