భాయ్ ఆడియో వేడుకలో డాన్స్ వేద్దామనుకున్నాను – నాగ్

Nagarjuna
కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ‘భాయ్’ సినిమా ఆడియోని కొద్ది సేపటి క్రితమే హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ 7 ఎకర్స్ లో విడుదల చేసారు. నాగార్జున ఈ సినిమా విజయంపై తన నమ్మకాన్ని వ్యక్తం చెయ్యడమే కాకుండా ఆడియో ఫంక్షన్ ని బాగా గ్రాండ్ గా చేద్దామని ప్లాన్ చేసాం కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా వెయ్యడం వల్ల అది కుదరలేదని తెలియజేశారు.

నాగార్జున మాట్లాడుతూ ‘ ఆడియో రిలీజ్ కోసం పెద్ద ప్లాన్ చేసాం. ఆడియో ఫంక్షన్ లో భాయ్ టైటిల్ సాంగ్ కి స్టేజ్ పైన నేను డాన్స్ చెయ్యాలని అనుకున్నాను. కానీ ఆ ఫంక్షన్ రద్దయ్యింది. దేవీశ్రీ ప్రసాద్ మంచి మ్యూజిక్ అందించాడు. వీరభద్రం చౌదరి చాలా బాగా తీసాడని’ అన్నారు.

అలాగే మాట్లాడుతూ ‘ ఇటీవలే విడుదలైన అత్తారింటికి దారేది సినిమా చూసాను. పైరసీ ఇబ్బందులు ఎదుర్కొన్నా, వేరే ఇబ్బందులు ఉన్నా సినిమా బాగుంటే విజయం సాధిస్తుందని ఆ సినిమా నిరూపించింది. ఆ సినిమాకి పనిచేసిన దేవీశ్రీనే ఈ సినిమాకి మ్యూజిక్ అందించాడు. అలాగే ఆ సినిమాలో భాగస్వాములైన రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ వారు ఈ సినిమాకి కూడా భాగస్వాములు. కావున ఈ సినిమా కూడా ఆ సినిమాలా విజయం సాదిస్తుందని’ ఆయన అన్నారు.

ఈ కార్యక్రమానికి రిచా గంగోపాధ్యాయ్, వీరభద్రం చౌదరి తదితరులు హాజరయ్యారు. ఈ సినిమా అక్టోబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version