ఆ ముగ్గురిలా మంచి నటి కావాలనుకున్నాను – సిల్క్ స్మిత

unnamed

ఒకప్పుడు సౌత్ ఇండియా మొత్తాన్ని ఒక ఊపు ఊపిన గ్లామర్ డాల్ సిల్క్ స్మిత అని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. ఈ రోజు ఆమె పుట్టిన రోజు. ఇప్పటికి సిల్క్ స్మిత అంటే ఇష్టపడే వారు చాలా మందే ఉంటారు. సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి వడ్లపాటి. 1978 లో ఓ కన్నడ సినిమా ద్వారా చిత్ర పరిశ్రమకి పరిచయమైన సిల్క్ స్మిత సుమారు 400 పైగా సినిమాల్లోనటించింది. 1996 లో సిల్క్ స్మిత అనుమానాస్పదంగా తన అపార్ట్ మెంట్ లో ఆత్మ హత్య చేసుకొని చనిపోయింది.

ఈ రోజు సిల్క్ పుట్టిన రోజు సందర్భంగా ఓ నేషనల్ మాగజైన్ వాళ్ళు 1984 లో సిల్క్ స్మితతో తీసుకున్న ఇంటర్వ్యూని ప్రచురించారు. ఇందులో మీరు ఎక్కువగా గ్లామరస్ పాత్రల్లోనే ఎందుకు కనిపించారని సిల్క్ ని అడిగితే ‘ నేను సావిత్రి, సుజాత, సరితలా మంచి నటి కావాలని అనుకున్నాను. కానీ నేను తమిళ్ లో చేసిన మొదటి సినిమా ‘వండిచక్కారం’ లో నా పాత్ర పేరు సిల్క్ స్మిత. ఒక బార్ డాన్సర్ ని, ఆ పాత్రకి మంచి పేరు రావడమే కాకుండా సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత నాకు వరుసగా గ్లామర్ రోల్స్ వచ్చాయి. నిర్మాతలు, డైరెక్టర్స్ వచ్చి అడగడం వల్ల కాదనలేకపోయానని’ సమాధానం ఇచ్చింది.

రెండువందల సినిమాల్లో నటించారు. మీకు పనిచేసిన వారిలో ఎవరితో పనిచేయడం అంటే ఇష్టం అని అడిగితే ‘ డైరెక్టర్స్ పరంగా భారతీ రాజా, బాలు మహేంద్ర గార్లతో పనిచేయడం చాలా ఇష్టం. అలాగే తమిళ్ లో బెస్ట్ యాక్టర్ కమల్ హాసన్ తో పనిచేయడం ఇష్టం, తెలుగులో అయితే చిరంజీవి. వీరిద్దరూ మంచి డాన్సర్స్. వీరిద్దరితో డాన్స్ చెయ్యడం అంటే నాకు చాలా ఇష్టమని’ సిల్క్ సమాధానం ఇచ్చింది.

2011 లో సిల్క్ స్మిత జీవితాన్ని ఆధారంగా చేసుకొని విద్యాబాలన్ ప్రధాన పాత్రలో చేసిన ‘ది ధర్టీ పిక్చర్’ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

Exit mobile version