నాకు చిరంజీవి గారితో డాన్సు వేయాలని ఉంది :కార్తీక

నాకు చిరంజీవి గారితో డాన్సు వేయాలని ఉంది :కార్తీక

Published on May 10, 2012 3:22 PM IST


ప్రముఖ సీనియర్ నటి రాధ చిరంజీవితో చాలా సినిమాల్లో ఆయనతో సమానంగా డాన్సులు వేసి మెప్పించింది. కొన్ని రోజుల తరువాత ఆమె పెళ్లి చేసుకొని సినిమాలు ఆపేసిన ఆమె కూతురు కార్తికని హీరొయిన్ గా చేసిన విషయం తెల్సిందే. ‘జోష్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కార్తీక ఆ తరువాత నటించిన ‘రంగం’ సినిమా ద్వారా ప్రేక్షకులకు దగ్గరైంది. ఆమె నటించిన ‘దమ్ము’ సినిమా ఇటీవలే విడుదలైంది. ఈ చిత్ర విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న కార్తీక చిరంజీవితో డాన్సు చేయాలని ఉందంటూ తన మనసులోని కోరికను బయట పెట్టింది. చిరంజీవి గారితో డాన్సు వేయడంలో కిక్కుంది అంటూ చెప్పుకొచ్చింది. త్వరలో ఆమె కోరిక నెరవేరాలని కోరుకుందాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు