రవితేజ డెడికేషన్ అంటే ఇష్టమన్న దాసరి

రవితేజ డెడికేషన్ అంటే ఇష్టమన్న దాసరి

Published on Jun 3, 2013 8:42 AM IST

Dasari-Narayana

దర్శకరత్న దాసరి నారాయణ రావుని మెప్పించడం అంత సులువైన విషయం కాదు, కానీ ఆయన మన మాస్ మహారాజ రవితేజ విషయంలో మాత్రం బాగా ఇంప్రెస్ అయ్యారు. ‘బలుపు’ ఆడియో ఫంక్షన్ లో దర్శకరత్న రవితేజని పొగడ్తలతో ముంచెత్తాడు. ‘నాకు రవితేజ అంటే చాలా ఇష్టం. రవితేజ హార్డ్ వర్క్, పని పట్ల అంకిత భావం, అలాగే ఎంతో కమిట్ మెంట్ తో పనిచేసే వ్యక్తి. అతను వాటినే ఆయుధాలుగా చేసుకొని సినిమాలు చేస్తున్నాడు, అందుకే అతనంటే గౌరవం. అలాగే రవితేజ ఇండస్ట్రీలోకి ఎలాంటి సపోర్ట్ లేకుండా వచ్చి సెటిల్ అయ్యాడు, అది చాలా కష్టమైన విషయమని’ దాసరి అన్నారు.

ఈ నెల 21 న రిలీజ్ కావడానికి సిద్దమవుతున్న ఈ సినిమాకి గోపీచంద్ మలినేని డైరెక్టర్. శృతి హాసన్, అంజలి హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ కంపోజ్ చేసాడు. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా ఉంటుందని ఆశిస్తున్న ఈ సినిమాని పివిపి సినిమా బ్యానర్ వారు నిర్మించారు.

తాజా వార్తలు