యంగ్ హీరో నితిన్ నటించిన ‘ఇష్క్’ సినిమా 2012లో సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో డైలాగ్స్ కి మంచి పేరు తెచ్చుకున్న హర్షవర్ధన్ ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాతో బాగా ఫేమస్ అవ్వడమే కాకుండా ఓ పెద్ద సినిమాకి రైటర్ గా చాన్స్ కొట్టేసారు. ఆయన ఓ ప్రముఖ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అసలు ఇండస్ట్రీకి ఎలా వచ్చారు? రైటర్ నుంచి డైరెక్టర్ గా మారే అవకాశాలేమన్నా ఉన్నాయా? అని ప్రశ్నిస్తే దానికి సమాధానమిస్తూ ‘ అసలు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడం అనేది నా ఆశయం. అనుకోకుండా నటున్నయ్యాను. ఆ తర్వాత ‘శాంతి నివాసం’, అమృతం’ లాంటి సీరియల్స్ కి దర్శకత్వం వహించాను. నాకు మొదటి నుంచి రైటింగ్ అంటే ఆసక్తి ఎక్కువ. గతంలో ‘త్రీ’, ‘విశాఖ ఎక్స్ ప్రెస్’ సినిమాలకు రైటర్ గా పనిచేసాను. అవినాకు పెద్దగా గుర్తింపు ఇవ్వలేదు. ఇష్క్ తో మంచి పేరు వచ్చింది. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ గుర్తింపు వచ్చింది. దాంతో నాగార్జున గారు నన్ను నమ్మి ‘మనం’ సినిమాకి చాన్స్ ఇచ్చారు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయను. అందుకే ప్రస్తుతం నా దృష్టంతా ఆ సినిమా పైనే ఉంది. అది పూర్తయిన తర్వాత వచ్చే అవకాశాల్ని బట్టి డైరెక్షన్ గురించి ఆలోచిస్తానని’ హర్షవర్ధన్ అన్నాడు.
మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనుకొని రైటర్ అయ్యాడట
మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనుకొని రైటర్ అయ్యాడట
Published on Jun 18, 2013 3:18 PM IST
సంబంధిత సమాచారం
- ఇంటర్వ్యూ : ప్రియాంక మోహన్ – ‘ఓజీ’ నాకు చాలా స్పెషల్..!
- ఓజి : ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి..!
- తారక్ తో ఇలాంటి సినిమా అంటున్న “మిరాయ్” దర్శకుడు!
- ‘ఓజి’ ప్రీమియర్ షోస్ లేవా.. కానీ!
- 4 రోజుల్లో వరల్డ్ వైడ్ “మిరాయ్” వసూళ్లు ఎంతంటే!
- మెగాస్టార్ ‘వృషభ’ టీజర్ కి డేట్ ఖరారు!
- ‘ఓజి’ ప్రమోషన్స్ షురూ చేసిన పామ్!
- పోల్ : ‘ఓజి’ నుంచి ఇపుడు వరకు వచ్చిన నాలుగు సాంగ్స్ లో మీకేది బాగా నచ్చింది?
- “కిష్కింధపురి” పై చిరంజీవి వీడియో రివ్యూ వైరల్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘తను రాధే నేను మధు’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటున్న ‘ఓజి’ టీం!
- ‘డ్రాగన్’ కోసం కొత్తగా ట్రై చేస్తోన్న ఎన్టీఆర్ ?
- 4 రోజుల్లో వరల్డ్ వైడ్ “మిరాయ్” వసూళ్లు ఎంతంటే!
- పోల్ : ‘ఓజి’ నుంచి ఇపుడు వరకు వచ్చిన నాలుగు సాంగ్స్ లో మీకేది బాగా నచ్చింది?
- ఓజి : గన్స్ ఎన్ రోసెస్.. ఊచకోతకు సిద్ధం కావాల్సిందే..!
- ఓటీటీ సమీక్ష : తమన్నా ‘డూ యూ వాన్నా పార్ట్నర్’ తెలుగు డబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో
- అఖిల్ ‘లెనిన్’ ఇంట్రో సీన్స్ పై కసరత్తులు !