మెగా స్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి అడుగుపెట్టడం వల్ల ఆయన చేయాలన్సిన 150వ సినిమా అలానే ఉండిపోయింది. మెగా అభిమానులంతా ఆయన 150వ సినిమా ఎప్పుడు చేస్తాడా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి సినిమా చేస్తానంటే నేనే ఆ సినిమాని నిర్మిస్తానని రామ్ చరణ్ అన్నాడు. నాన్న గారి 150వ సినిమా నిర్మిస్తామన్నారు, ఆ పని ఎంతవరకూ వచ్చిందని రామ్ చరణ్ ని అడిగితే ‘ నాన్న గారి కోసం రెండు కథలు రెడీగా ఉన్నాయి. నేనుకూడా సినిమా నిర్మించడానికి సిద్దంగా ఉన్నాను. నాన్నగారు ఎప్పుడు 3 నెలలు సమయం ఇస్తే అప్పుడు సినిమా అయిపోతుంది. ఇక సినిమా ఎప్పుడు చేస్తారన్నది ఆయన్ని మీరే అడగాలని’ చరణ్ సమాధానమిచ్చాడు.
అలాగే మీరు వెంకీ గారితో కలిసి కృష్ణవంశీ డైరెక్షన్ లో మల్టీ స్టారర్ సినిమా చేయనున్నారని వస్తున్న వార్తలపై మీ కామెంట్ ఏమిటని అడిగితే ‘ నేను వెంకీ గారితో చెయ్యాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ప్రస్తుతం కృష్ణవంశీ పర్ఫెక్ట్ కుటుంబకథా చిత్రం రెడీ చేస్తున్నారు. ఆ విశేషాలు మరో నెల రోజుల్లో చెబుతామని’ బదులిచ్చాడు. అలాగే మాట్లాడుతూ బాలీవుడ్లో సినిమా చేసింది కేవలం మార్కెట్ పెంచుకోవడం కోసమే తప్ప పేరు ప్రఖ్యాతలు, మనీ కోసం కాదని తెలిపాడు.