మంచు వారబ్బాయి మంచు విష్ణు ఇప్పటి వరకు యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. విష్ణు అదే తరహాలో చేసిన సినిమా దూసుకెళ్తా’. ఈ మూవీ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ విషయాన్ని పక్కనపెడితే ప్రస్తుతం ఉన్న దాదాపు అందరి యంగ్ హీరోలందరినీ మీడియా వారు మీ నాన్నగారు లేదా తాతగారు నటించిన సినిమాల్లో ఏ సినిమాని రీమేక్ చెయ్యాలని అనుకుంటారు అనే ప్రశ్నని ఎక్కువగా అడుగుతూ ఉంటారు. ఇదే ప్రశ్నని మంచు విష్ణు ముందు ఉంచితే …
‘నాన్నగారు నటించిన రాయలసీమ రామన్న చౌదరిని తమిళం, కన్నడలో రీమేక్ చేయ్యాలనుకున్నారు కానీ రజినీకాంత్ గారు, విష్ణు వర్ధన్ గారు చెయ్యలేమనుకొని వారి ప్రయత్నాన్ని మానుకున్నారు. వాళ్ళ వల్లే కాలేదు ఇక ఇక నా వల్ల ఏమవుతుంది. కానీ అసెంబ్లీ రౌడి మాత్రం చేస్తాను. అలాగే నాకు చిరంజీవి గారి ‘జగదేక వీరుడు – అతిలోక సుందరి’ సినిమా అంటే చాలా ఇష్టం. చరణ్ దాని చేస్తే బాగుంటుంది. ఒక వేళ చరణ్ చెయ్యనంటే ఆ అవకాశం నేను దక్కించుకొని చేస్తానని’ అన్నారు.