నా దర్శకులను నిరాశపరచను – త్రిష

నా దర్శకులను నిరాశపరచను – త్రిష

Published on Nov 5, 2012 12:01 PM IST


తమిళ కుట్టి త్రిష ప్రస్తుతం తెలుగు తెరపై అడపాదడపా కనిపిస్తున్న త్రిష ఇప్పటివరకూ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా పెద్ద హిట్స్ ని తన తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు కొంచెం సక్సెస్ కి దూరంగా ఉన్న ఈ భామని ఒక ప్రముఖ న్యూస్ పేపర్ వారు అడిగిన ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ ‘ ఒక సినిమా సక్సెస్ అయితే హీరోయిన్ కి మాత్రం అంత మంచి పేరు రాదు కానీ అదే సినిమాలో ఎంత బాగా నటించినా అది ఫ్లాప్ అయితే మాత్రం పూర్తి భాద్యత కథానాయికదే అని తేల్చేస్తారు. ముందు మీరు సినిమా సక్సెస్ అయితే అందులో హీరోయిన్ కి కూడా ప్రాముఖ్యత ఇవ్వండి. అప్పుడు సినిమా ఫ్లాప్ అయితే మేము కూడా పూర్తి భాద్యత తీసుకుంటామని’ ఆమె అన్నారు.

అలాగే ఆమె మాట్లాడుతూ ‘ నా మీద నమ్మకం పెట్టి నాకొక పాత్ర ఇచ్చినప్పుడు నేనెప్పుడు దర్శకులను లేదా నిర్మాతలను నిరుత్సాహపరిచేలా నడుచుకోను. వారికి ఎం కావాలో అది 100% ఇస్తాను’ అని త్రిష అన్నారు. త్రిష మంచి నటి మళ్ళీ తనకి మంచి పాత్రలు వచ్చి తన పూర్వ వైభవాన్ని తెచ్చుకుంటుందేమో చూడాలి.

తాజా వార్తలు