కమెడియన్ నుండి కథానాయకుడిగా మారిన సునీల్ “అందాల రాముడు” చిత్రం నుండి ప్రస్తుత పరిస్థితి వరకు ఎలా ఎదిగాడో అందరికి తెలిసిందే. కాని సునీల్ ఎప్పుడు తను హీరో అవ్వాలని అనుకోలేదని చెప్పారు. ఆయనకి విలన్ అవ్వాలంటే ఇంట్రెస్ట్ అని తెలిపారు. “నాకు విలన్ పాత్రలు చేయ్యలంటేనే ఇష్టం మన కోపాన్ని బయటపెట్టుకోడానికి మంచి దారి అది ,దానికి డబ్బులు కూడా ఇస్తారు” అని సునీల్ ఒక ప్రముఖ పత్రికతో చెప్పారు. దాదాపు దశాబ్ద కలం పాటు మనల్ని అందరిని నవ్వించిన సునీల్ కి ఇలాంటి ఆలోచన ఉండటం కాస్త ఆశ్చర్యకరమయిన విషయం. ప్రస్తుతం అయన దేవి ప్రసాద్ దర్శకత్వంలో “మిస్టర్ పెళ్ళికొడుకు” మరియు కిషోర్ కుమార్ దర్శకత్వంలో “వెట్టై ” చిత్ర రీమేక్లో నటిస్తున్నారు