ఈ మాట అందాల సుందరి శ్రద్ద దాస్ నోట వినడం కాస్త ఆశ్చర్యకరమయిన విషయమే ” నాకు మన సంస్కృతికి అడ్డం పట్టే వస్త్రాలు ధరించడం అంటే చాలా ఇష్టం. కాని ఈ పరిశ్రమ లో నిలదొక్కుకోవాలంటే వెస్టర్న్ సంస్కృతికి చెందిన దుస్తులు ధరించాల్సిందే ఇది సంతోషంగా చేస్తున్న పని అయితే కాదు ” అని శ్రద్ద అన్నారు. ఈ మధ్యే తను చేసిన సాంస్కృతిక వస్త్రాల ఫోటో షూట్ మీద అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానం ఇది. ” పరికిణి మరియు సాంస్కృతిక వస్త్రాలలో ఫోటో షూట్ చేశాను. ఇవి నాకు చాలా ఇష్టమయిన వస్త్రాలు, షూట్ ని చాలా ఎంజాయ్ చేశాను” అని అన్నారు. పరిశ్రమలో తనదయిన స్థానం కోసం ఈ నటి పోరాడుతున్నారు. సాయి ధరం తేజ్ హీరోగా పరిచయం అవుతున్న “రేయ్” చిత్రంలో ఈ భామ కనిపించబోతున్నారు.