ఈ సినిమా సక్సెస్ ఆస్కార్ అవార్డు కన్నా ఎక్కువ – మిక్కీ

ఈ సినిమా సక్సెస్ ఆస్కార్ అవార్డు కన్నా ఎక్కువ – మిక్కీ

Published on Jan 21, 2013 12:54 PM IST

mickey-j
ఓ సినిమా విజయం సాధించాలి అంటే మ్యూజిక్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అందులోనూ ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ మూవీ అంటే మ్యూజిక్ చాలా అవసరం. సంక్రాంతి కానుకగా విడుదలైన కుటుంబ కథా చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. ఈ సినిమా విజయంలో మిక్కీ జె మేయర్ మ్యూజిక్ ఒక హైలైట్ గా చెప్పుకోవచ్చు. మ్యూజిక్ అంత పెద్ద విజయం సాదించడంతో ఆదివారం సాయంత్రం హైదరాబాద్ శిల్పకళా వేదికలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకి సూపర్ స్టార్ కృష్ణ, మూవీ మొఘల్ డా. డి రామానాయుడు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.

ఈ వేడుకలో మిక్కీ మాట్లాడుతూ ‘ ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు ముందుగా దిల్ రాజు గారికి నా కృతఙ్ఞతలు. అలాగే ఇండస్ట్రీలో ఎంతో మంది సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు కానీ నన్ను నమ్మి ఇంత పెద్ద సినిమా ఆఫర్ నాకిచ్చినందుకు శ్రీ కాంత్ అడ్డాల గారికి నా ధన్యవాదాలు. నా వరకు ఈ సినిమా సక్సెస్ ఆస్కార్ అవార్డు వచ్చిన దానికన్నా ఎక్కువని’ అన్నారు.

తాజా వార్తలు