ఈ సినిమాతో తెలుగు వారికి మరింత దగ్గరయ్యాను

ఈ సినిమాతో తెలుగు వారికి మరింత దగ్గరయ్యాను

Published on Dec 5, 2012 11:00 PM IST

నాగార్జున, అనుష్క జంటగా నటించిన సోషియో ఫాంటసీ చిత్రం ఢమరుకం. ఈ సినిమాలో ప్రతినాయకుడు పాత్రల్లో ఒకరిగా నటించిన గణేష్ వెంకట్రామన్ ఈ రోజు పాత్రికేయులతో ముచ్చటించాడు. 2003 సంవత్సరంలో మిస్టర్ ఇండియా అవార్డు అందుకున్న గణేష్ ట్రిపుల్ ఎక్స్, ఎల్ఐసి వంటి చాలా కంపెనీ ప్రచార చిత్రాల్లో నటించాడు. కమల్ హాసన్, వెంకటేష్ తో కలిసి ఈనాడు సినిమాలో నటించాడు. ఆకాశమంత సినిమాలో త్రిష బాయ్ ఫ్రెండ్ పాత్రలో కూడా నటించాడు. గణేష్ మాట్లాడుతూ శ్రీనివాస్ రెడ్డి డైరెక్షన్లో ఢమరుకం సినిమాలో నటించడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా ద్వారా తెలుగు వారికి మరింత దగ్గరయ్యాను. శ్రీనివాస్ రెడ్డి గారు ఈ సినిమా కథ నాకు మొదట చెన్నైలో చెప్పారు. ఆయన కథ చెప్పగానే వెంటనే ఓకే చెప్పాను. ఈ సినిమాలో పాత్రకు తగ్గట్లు నా బాడీ లాంగ్వేజ్ ని మార్చారు. ఈ సినిమాని నేను కూకట్ పల్లి లోని భ్రమరాంబ ధియేటర్లో ప్రేక్షకుల మధ్య కూర్చొని చూసాను. చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు