వర్ధమాన నటి ఛార్మి ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ ని కొట్టినట్లు రూమర్లను వార్తలను ఖండించింది.తాను ఎవరిని కొట్టలేదని తన సోషల్ నెట్వర్కింగ్ సైట్లో చెప్పింది. వివరాల్లోకి వెళితే యంగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ని ఛార్మి కొట్టినట్లు గత నాలుగైదు రోజులుగా మీడియాలో వార్తలొస్తున్నాయి. ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రిక కూడా ఈ వార్తను హైలెట్ చేస్తూ రాయడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. మరో వైపు హరీష్ శంకర్ కూడా దీనిపై స్పందించాడు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి వార్తలు రాస్తారని, ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదనేది ఆయన వాదన. ఏది ఏమైనప్పటికీ ఇలా వార్తల్లోకి ఎక్కడం సినిమా వారికి కొత్తేమీ కాదు.