ఇంటిపేరు అవసరం లేదంటున్న శిరీష్.!

ఇంటిపేరు అవసరం లేదంటున్న శిరీష్.!

Published on Dec 6, 2012 5:23 PM IST


ఈ మధ్య కాలంలో సీనియర్ హీరో, నిర్మాత, దర్శకుల కొడుకులు హీరోలుగా పరిచయమవుతున్నారు. అదే కోవలో అల్లు వారి కుటుంబం నుండి అల్లు అరవింద్ రెండవ తనయుడు, అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ ‘గౌరవం’ సినిమాతో తెలుగు వారికి పరిచయం కానున్నాడు. ఇటీవలే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మీ ఇంటి పేరుని సినిమాలో వాడట్లేదా అని అల్లు శిరీష్ ని అడిగితే ‘ నా పూర్తి పేరు అల్లు శిరీష్ కానీ నేను ఎక్కడికి వెళ్ళినా అందరూ నన్ను అల్లు అల్లు అని పిలుస్తున్నారు. అందరూ నా పేరు అల్లు అని ఇంటిపేరు శిరీష్ అనుకుంటున్నారు. మామూలుగా నన్ను నన్నుగా గుర్తు పట్టాలనుకుంటున్నాను, అందుకే తెరపై కూడా శిరీష్ అని మాత్రమే వేసుకుంటానని’ శిరీష్ అన్నాడు.

రాధామోహన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో యామి గౌతమ్ హీరోయిన్ గా నటించింది. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. జనవరి చివర్లో ఈ సినిమాని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

తాజా వార్తలు