ఫెయిల్యూర్స్ చూసి నేనెప్పుడూ భాధ పడలేదు

ఫెయిల్యూర్స్ చూసి నేనెప్పుడూ భాధ పడలేదు

Published on Nov 15, 2012 8:26 AM IST


శృతి హాసన్ కెరీర్ మొదట్లో లక్, అనగనగా ఒక ధీరుడు, సెవెంత్ సెన్స్, ఓహ్ మై ఫ్రెండ్, 3 ఇలా ఆమె నటించిన సినిమాలన్నీ పరాజయం పాలవుతుంటే అందరూ ఆమెను ఐరన్ లెగ్ అనడం మొదలు పెట్టారు. అయితే హరీష్ శంకర్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ సరసన నటించిన ‘గబ్బర్ సింగ్’ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అందరి నోరు మూయించింది. అపజయాలు ఎల్ల కాలం ఉండవు, పరాజయం తరువాత విజయం కూడా వస్తుందనే నమ్మకం ఉంటె ఖచ్చితంగా సక్సెస్ అవొచ్చు. ఇదే సూత్రాన్ని శృతి హాసన్ కూడా నమ్మింది. పరాజయాల నుండి పాఠాలు నేర్చుకుంది. ఒకప్పుడు ఆమెని వద్దన్న వారే ఇప్పుడు ఆమె వెంట పడుతున్నారు. రామ్ చరణ్ ‘ఎవడు’ సినిమాలో సమంతని తప్పించి ఆమె స్థానంలో శృతి హాసన్ తీసుకున్నారు. బలుపు సినిమాలో రవితేజకి జోడీగా కూడా నటిస్తుంది. హిందీలో నువ్వొస్తానంటే నేనొద్దంటానా రీమేక్లో కూడా నటిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు