యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కెరీర్లో ‘ఛత్రపతి’ సినిమాకు ప్రత్యేక స్థానం వుంది. ఆ సినిమా ప్రభాస్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గానే కాకుండా ఆ తరువాత విడుదలైన ప్రతీ సినిమాపైన ఆ ప్రభావం ఎంతగానో పడింది. ఒక సందర్బంలో ప్రభాస్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ “నేను ప్రతీ సినిమాకూ ఒకలానే కష్టపడతాను. కానీ ఛత్రపతి చిత్రం నా నుండి విపరీతమైన ఎనర్జీ ను కోరుకుంది. నాలుగు ఫైట్లు, ఒక మాస్ పాటను పుర్తిచేయ్యడానికి నేను చాలా కష్టపడ్డాను. నేను ఒత్తిడికి గురయ్యిన సందర్భం అదే” అని తెలిపాడు. ప్రస్తుతం అదే డైరెక్టర్ రాజమౌళి కొత్త సినిమా ‘బాహుబలి’లో పోరాట యోధునిగా కనిపించనున్న ప్రభాస్ ను ఈ సినిమాలో రాజమౌళి మరింకెంత కష్టపెడతాడో చూడాలి.