ఇండియా మొత్తం భాషతో సంబంధం లేకుండా పాపులరిటీ, ఇమేజ్ ను సంపాదించుకున్న అతికొద్ధిమంది వారిలో రజిని కాంత్ ఒకరు. ఆయన అభిమానులు తనపై చూపించే ప్రేమే దీనికి నిదర్శనం. అందుకే ప్రముఖ ఎన్.డి.టీ.వి 25వ వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్ లో జరిగే వేడుకకు ఆయనను ఆహ్వానించడంలో పెద్ద ఆశ్చర్యమేమి కలగలేదు.
ఈ వేడుకలో రజిని మాట్లాడుతూ “ఈరోజుల్లో చాలామంది అద్బుతాలను నమ్మరు. కానీ నేను నమ్ముతాను. ఒక సాధారణ బస్ కండక్టర్ గా వుండే నేను ఈరోజు ఇలా వుండడం అద్భుతమే కదా” అని తెలిపాడు. అంతేకాక ప్రణబ్ ముఖర్జీ అందించిన అవార్డును తన సోదరుడు సత్యనారాయణ రావు గైక్వాడ్ కు, ఆయన గురువు బాలచందర్ కు అంకితమిచ్చారు. “తమిళ ప్రజల అండదండలు లేకుండా నేను ఈ స్థితిలోకి రాలేనని” తెలిపారు
ఈ ప్రముఖ ఛానెల్ తెలిపిన 25 లివింగ్ లెజెండ్స్ జాబితాలో అమితాబ్ బచ్చన్, ఏ.ఆర్ రెహమాన్, షారూఖ్ ఖాన్ మరికొంతమందితో పాటు రజినికాంత్ కూడా నిలిచారు