ఆ హీరొయిన్ సినిమాను ఒప్పుకునే ముందు పెద్దగా ఆలోచించదట

Nithya-Menen
‘గుండె జారి గల్లంతయ్యిందే’ సినిమా విజయం సాదించడంతో ఇప్పుడు ప్రతీ ఒక్కరూ నిత్యా మీనన్ గురించే మాట్లాడుకుంటున్నారు. ‘అలా మొదలైంది’ సినిమా నుండి అంతకంతకూ తనని తానూ మెరుగుపరుచుకుంటూ అతి తక్కువ సమయంలో అందరి ప్రశంసలు పొందింది. ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె ఈ విధంగా చెప్పింది. “నేను సినిమాను ఒప్పుకునే ముందు ఏమి ఆలోచించను. నా పాత్ర ఇలాగే ఉండాలని మనసులో ఎటువంటి నిర్ణయాలూ తీసుకొను. అక్కడ ఉన్న పాత్ర నాకు, సినిమాకు కనెక్ట్ అయితే వెంటనే ఒప్పుకుంటాను. నిజానికి సినిమా జయాపజయాల కంటే సినిమా తీసే విధానమే ముఖ్యమని” చెప్పింది.
‘గుండె జారి గల్లంతయ్యిందే’ సినిమాలో ధనవంతుడి కూతురుగా నటించి హీరోతో ప్రేమలో పడి చివరకు ఆ హీరోకే గుణపాటం చెప్పాలని కోరుకునే పాత్ర. ఇందులో తన నటన నిజంగా అద్బుతం. అందుకే విమర్శకుల పప్రశంసలు సైతం సంపాదించుకుంది. ‘గుండె జారి గల్లంతయ్యిందే’ సినిమా తరువాత ఆమెను శర్వానంద్ తో కలిసి నటిస్తున్న ‘ఏమిటో ఈ మాయ’ సినిమాలో చూడచ్చు.

Exit mobile version