నా అంత అదృష్టవంతురాలు ఎవరూ ఉండరు : ప్రియా ఆనంద్

నా అంత అదృష్టవంతురాలు ఎవరూ ఉండరు : ప్రియా ఆనంద్

Published on Jul 22, 2012 9:02 PM IST


‘లీడర్’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ప్రియా ఆనంద్ బాలీవుడ్ లో పరిచయమవుతున్న చిత్రం “ఇంగ్లీష్ వింగ్లీష్”. ప్రియా ఆనంద్ ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చాలా కాలం తర్వాత శ్రీ దేవి నటిస్తున్న చిత్రం ఇది మరియు ప్రియా ఆనంద్ కి ఇష్టమైన నటి శ్రీ దేవి సరసన నటించే అరుదైన అవకాశాన్ని దక్కించుకుంది. ‘ ఈ ప్రపంచంలో నా అంత అదృష్టవంతురాలు ఎవరూ ఉండరు. నా రోల్ మోడల్ అయిన శ్రీ దేవి గారి సరసన నటించే అవకాశం లబించింది. ఈ చిత్ర దర్శకురాలు గౌరికి ధన్యవాదాలు అని” ప్రియా ఆనంద్ కొద్ది రోజుల క్రితం తన ట్విట్టర్లో పేర్కొన్నారు.

ఈ చిత్ర తెలుగు వర్షన్ కి సంభందించిన డబ్బింగ్ కార్యక్రమాలను ప్రియా ఆనంద్ పూర్తి చేసేసింది. ‘ ఇప్పుడే ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ తెలుగు వర్షన్ డబ్బింగ్ పూర్తి చేశాను మరియు గౌరీ గారు ఈ చిత్రంలో చాలా మంచి సన్నివేశాలను చిత్రీకరించారు. అమిత్ త్రివేది గారి నేపధ్య సంగీతం చాలా బాగుందని’ ప్రియా ఆనంద్ ఈ రోజు ట్విట్టర్లో పేర్కొన్నారు. గౌరీ షిండే దశాకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం మరియు హిందీ భాషల్లో సెప్టెంబర్ 21న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు