ఈ సినిమాతో నేను పెద్ద రిస్క్ చేస్తున్నాను – మోహన్ బాబు

Mohan-Babu
కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటించిన ‘పాండవులు పాండవులు తుమ్మెద’ సినిమా జనవరి 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా డా. మోహన్ బాబు కాసేపు పత్రికా మిత్రులతో ముచ్చటించారు. ఎప్పటిలానే నిక్కచ్చిగా మాట్లాడే మనస్తత్వం తో ఆయన మాట్లాడారు.

‘పాండవులు పాండవులు తుమ్మెద సినిమాతో నేను పెద్ద రిస్క్ చేస్తున్నాను. ఈ సినిమా కోసం మేము 30 కోట్ల బడ్జెట్ తో సినిమా చేసాము, అలాగే నేను సొంతంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం రిలీజ్ చేస్తున్నాను. బిజినెస్ పరంగా ఈ సినిమాకి 20 కోట్లకి ఆఫర్ వచ్చింది. నా శ్రేయోభిలాషులు ఇచ్చేయమన్నారు. కానీ నేను కాదన్నాను. నేను ఇక్కడే డబ్బు సంపాదించాను. అలాగే నేను మనీతో గ్యాంబ్లింగ్ చేయడం లేదు. బాబా దయవల్ల సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందని’ నమ్మకంగా ఉందని అన్నాడు.

అలాగే డా. మోహన్ బాబు ఈ సినిమా బాగా వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని అన్నాడు. మోహన్ బాబు మంచు మనోజ్ లేడీ గెటప్ గురించి కూడా కొన్ని కామెంట్స్ చేసారు. ‘మంచు మనోజ్ కి తను చేసిన లేడీ గెటప్ మంచి గుర్తింపునిస్తుంది. అందరూ తన గురించి చేస్తున్న కామెంట్స్ అన్నీ సినిమా చూడగానే అవి అన్నీ కొట్టుకుపోతాయి. మంచు మనోజ్ లేడీ గెటప్ పాత్ర పేరు మోహిని’ అని అన్నాడు.

Exit mobile version