తమ్ముడు లేని లోటు తీరింది – వెంకటేష్

తమ్ముడు లేని లోటు తీరింది – వెంకటేష్

Published on Jan 21, 2013 8:22 AM IST

SVSC-platinum-fun
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రం విడుదలై ప్రేక్షకుల మనసు గెలుచుకుని ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా ఈ చిత్ర ప్లాటినం డిస్క్ నిన్న సంప్రదాయబద్ధంగా జరిగింది. వెంకటేష్, మహేష్ బాబు కలిసి నటించిన ఈ మల్టీ స్టారర్ చిత్ర ప్లాటినం డిస్క్ వేడుకకి వారి తండ్రులు సూపర్ స్టార్ కృష్ణ, డాక్టర్ డి. రామానాయుడు విచ్చేసారు. సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ ‘ఈ సినిమా పల్లెటూరి వాతావరణంని ప్రతిబింబించింది. ఈ కథని ఇద్దరు హీరోల చుట్టూ అల్లుకోలేదు. కుటుంబాల మధ్య పుట్టిన కథ’ అన్నారు. వెంకటేష్ మాట్లాడుతూ ‘నిజ జీవితంలో నేనొక అన్నకి తమ్ముడిని. కానీ నాకు తమ్ముడు లేడు. ఈ సినిమా వల్ల నాకొక తమ్ముడు దొరికాడు’ అన్నారు.

తాజా వార్తలు