బిగ్ బాస్ పై నాకు ఆసక్తి లేదంటున్న హీరో..!

బిగ్ బాస్ పై నాకు ఆసక్తి లేదంటున్న హీరో..!

Published on Jul 22, 2020 8:24 AM IST

కరోనా నేపథ్యంలో ఈఏడాది బిగ్ బాస్ షో నిర్వహణ కష్టమే అని అభిమానులు ఫిక్స్ అయ్యారు. ఐతే ఎట్టి పరిస్థితులలో బిగ్ బాస్ నిర్వహించడం పక్కా అని స్టార్ మా తెలియజేసింది. తాజాగా బిగ్ బాస్ సీజన్ 4 లోగో విడుదల చేసి స్పష్టత ఇచ్చింది. దీనితో బిగ్ బాస్ పార్టీసిపెంట్స్ పై అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా హీరో తరుణ్ బిగ్ బాస్ లేటెస్ట్ సీజన్ లో పాల్గొననున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన క్లారిటీ ఇచ్చారు.

తరుణ్ తన సందేశంలో… బిగ్ బాస్ షోలో పాల్గొనమని నన్ను ఎవరూ సంప్రదించలేదు. అలాగే ఆ షోలో పాల్గొనడానికి నాకు ఆసక్తిలేదు. నేను బిగ్ బాస్ లో పాల్గొంటున్నానని వస్తున్న వార్తలలో ఎటువంటి నిజం లేదు అని అన్నారు. ఇక ఈ సారి బిగ్ బాస్ హోస్ట్ ఎవరనేది.. ఇంకా తెలియలేదు. ఈ ఏడాది కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించే అవకాశం కలదని తెలుస్తుంది.

తాజా వార్తలు