ప్రిన్స్ మహేష్ బాబు ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నారు. దూకుడు మరియు బిజినెస్ మేన్ రెండు వరుస భారీ హిట్స్ ఇచ్చిన ఆనందంలో ఉన్నారు. బిజినెస్ మేన్ సక్సెస్ సందర్భంగా నిన్న జరిగిన హెక్సా ప్లాటినం డిస్క్ ఫంక్షన్లో ఆయన పాల్గొన్నారు. నా జీవితంలో ఉత్తమ దశను ఇప్పుడు అనుభవిస్తున్నాను. గత సంవత్సరం 23 తేదీ నుండి నాకు అన్ని మంచి రోజులే వస్తున్నాయి. శ్రీను వైట్ల దూకుడుతో పెద్ద విజయాన్ని అందిస్తే, పూరీ దానిని బిజినెస్ మేన్ తో కంటిన్యు చేసారు.
మీ డైలాగుల్లో కొంచెం బూతు పదాలు దొర్లడం మీ పాత్రలో నెగటివ్ ఛాయలు కనిపించడం పట్ల మీకేమనిపించాలేదా అని అడగగా మేమేమీ కుటుంబ కథా చిత్రం చేస్తున్నాం అని చెప్పలేదు కదా, మాఫియా కథాంశం అని చెప్పాము. పూరీ జగన్నాధ్ ని పూర్తిగా నమ్మాను, ఆ నమ్మకాన్ని పూరీ నిలబెట్టుకున్నాడు. తెలుగు ఇండస్ట్రీలో ఎవరు మీకు పోటీ అని అడగగా ప్రతీ ఒక్కరు నాకు పోటీయే అని అన్నారు. నటుడిగా నేను ప్రతి సినిమాకు మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తుంటాను అన్నారు.