‘మిరాయ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అయితే, ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటించిన మంచు మనోజ్‌కి మంచి పేరు వచ్చింది. విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా దక్కాయి. ఐతే, ఇప్పటివరకు హీరోగా తనకంటూ ప్రత్యేకమైన స్టైల్‌ను చూపించిన మంచు మనోజ్ తొలిసారి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించడం విశేషం. పైగా మిరాయ్ సక్సెస్ వెనుక మనోజ్ పోషించిన విలన్ రోల్ కూడా కీలక కారణమనే చెప్పాలి. మనోజ్ స్క్రీన్ ప్రెజెన్స్, తన బాడీ లాంగ్వేజ్ తో పాటు మనోజ్ డైలాగ్ డెలివరీ కూడా చాలా బాగుంది.
కాగా మంచు మనోజ్ విలన్‌గా మారడం వెనుక ఓ కారణం ఉందని తాజా ఇంటర్వ్యూలో మనోజ్ స్వయంగా చెప్పుకొచ్చారు. ఇంతకీ, ఆ కారణం ఎవరో తెలుసా.. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అట. అసలు విలన్ గా నటించాలన్న నిర్ణయం ఎలా తీసుకున్నారంటూ మనోజ్‌కి ఓ ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు సమాధానంగా మనోజ్ మాట్లాడుతూ.. ‘నేను పవన్ కళ్యాణ్ అన్నని కలిసినప్పుడు.. నువ్వు విలన్‌గా చేస్తే మామూలుగా ఉండదు. ఇండస్ట్రీలో బిజీ ఆర్టిస్టువి అయిపోతావ్. ఒక్కసారి ట్రై చెయ్ అని సలహా ఇచ్చారు. అందుకే, విలన్ గా చేశాను’ అని మనోజ్ చెప్పుకొచ్చారు.